బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్ సీజన్ 3’. ఇక ఈ షోలో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఫైనల్ వరకు హోరాహోరీగా జరిగిన ఈ పోరులో రాహుల్ విజేతగా నిలిచాడు. చివరి వరకు ఓటింగ్ లో శ్రీముఖి.. రాహుల్ కి తీవ్ర పోటీ ఇచ్చింది. చివరకి రన్నరప్ గా సరిపెట్టుకుంది.

ఇక హౌస్ లో ఉండగా వీరిద్దరి మధ్య వివాదలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా వీరిద్దరూ కలసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గతంలో వీరు చేసుకున్న విమర్శలను మర్చిపోయి హ్యాపీగా పార్టీ చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ షో అయిపోయిన తరువాత ఎవరి షోలతో వారు బిజీగా ఉన్నారు.