100 రోజులకు పైగా సాగిన బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా రన్ అయిన సంగతి తెలిసిందే. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ షోలో రాహుల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ షోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఆద్యంతం షో ను రక్తి కట్టించాడు.

ఇక స్టార్ మా యాజమాన్యం నాగార్జునకు ఒక్కో ఎపిసోడ్ కు భారీగా చెల్లించినట్లు చెబుతున్నారు. నాగార్జున మొత్తం 30 పైగా ఎపిసోడ్లలో కనిపించిన సంగతి తెలిసిందే. గత సీజన్ ల కంటే ఈ సీజన్ బాగా సక్సెస్ కావడంతో నాగార్జునకి 5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇచ్చారట.

ఇక తొలి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 74 రోజుల పాటు జరిగిన ఆ సీజన్ లో ఎన్టీఆర్ కు 2.5 కోట్లుగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక రెండవ సీజన్ 100 రోజుల పైగా సాగినప్పటికీ ఆయన 3 కోట్ల తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరితో పోల్చుకుంటే నాగార్జునకు రెమ్యూనరేషన్ బాగా ఎక్కువనే చెప్పాలి.