శనివారం సాయంత్రం నుంచి వానపడుతున్నట్లే జాఫర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో జాగర్ – బాబా భాస్కర్ – శ్రీముఖి ముగ్గురు కలసి కాస్త సరదా సరదాగా అల్లరి చేస్తుండేవారు. ఇక నాగార్జున అక్కినేని చివరిగా వితిక – జాఫర్ వీరిద్దరూ మిగిలారు. మిగతా హౌస్ మేట్స్ ఎవరకు ఎంత మంది సపోర్ట్ చేస్తారనే దానిలో వితికకు 6 మంది ఓట్లు వేస్తే జాఫర్ కు 7 గురు సపోర్ట్ వేశారు. 

కానీ  జాఫర్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో శ్రీముఖి ఎక్కిఎక్కి ఏడ్చింది. బాబా భాస్కర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన జాఫర్ మొదట్లో ఇదంతా స్క్రిప్ట్ లో భాగం అనుకున్నానని, కానీ లోపల జరిగేవన్నీ రియల్ ఎమోషన్స్ అని తెలిపాడు. ఇక బయటకు వచ్చిన తరువాత జాఫర్ హౌస్ మేట్స్ తో “ముఖా ముఖి” కార్యక్రమం నిర్వహించాడు. 

శుక్రవారం నాడు వితిక హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగినా శనివారానికి వితిక బదులు జాఫర్ ఎలిమినేట్ అవుతాడని ప్రచారం జరగడంతో అందరు ముందుగా చెప్పినట్లే జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వస్తున్నారో చెప్పకుండా బిగ్ బాస్ ఎంత కంట్రోల్ చేయాలని అనుకున్నా లీకు వీరుల దెబ్బకు ఏమాత్రం ఆగడం లేదు. బిగ్ బాస్ యాజమాన్యం కూడా లీకులు ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆగకపోవడంతో చేతులెత్తేశారని తెలుస్తుంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •