బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్ ఆర్మీ గురించి తెలిసే ఉంటుంది. ఎంతలా ప్రేక్షకుల మెదళ్లలో కౌశల్ ఆర్మీ పేరుతో వచ్చి అందరూ కౌశల్ కే ఓట్లు వేయాలంటూ ఒక హైప్ క్రియేట్ చేసారు. ఇక కౌశల్ కూడా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనలను తనకు అనుకూలంగా మార్చుకొని సూపర్ సక్సెస్ అయింది.

ఇక ఇప్పుడు ఇదే ఫార్ములా శ్రీముఖి టీమ్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రెండవ వారానికి ఎంటర్ అవడంతో శ్రీముఖి టీమ్ ఇప్పుడిప్పుడే ఫుల్ యాక్టీవ్ అవుతుంది. శ్రీముఖికి సంబంధించి ఫేస్బుక్ ఫ్యాన్ పేజీలు, గ్రూప్స్ సోషల్ మీడియాలో క్రియేట్ చేయడం శ్రీముఖికి సంబంధించిన పాత వీడియోలు అప్లోడ్ చేయడంతో పాటు శ్రీముఖి హాట్ హాట్ గా పోజులు ఇచ్చిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ శ్రీముఖి టీమ్ ఎప్పుడు ప్రేక్షకుల అట్టెషన్ లో ఉంటుంది.

ఇక శ్రీముఖి హౌస్ లో ప్రవర్తన బట్టి మంచి మంచి మీమ్స్ తయారుచేసి వాట్సాప్ గ్రూప్స్ తో పాటు పేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, హలో లాంటి వాటిలో శ్రీముఖికి ఓట్లు వేసేలా శ్రీముఖి ఆర్మీ పేరుతో హడావిడి షురూ చేసారు. దీన్ని బట్టి చూస్తుంటే శ్రీముఖి హౌస్ లోకి వచ్చేటప్పుడు ఒక సోషల్ మీడియా టీమ్ ను బయట ఏర్పాటు చేసుకొని మంచి ప్లాన్ తో వచ్చినట్లు కనపడుతుంది. కానీ కౌశల్ ఆర్మీ అంతలా శ్రీముఖి ఆర్మీ సక్సెస్ అవుతుందా అంటే ముందు ముందు చూడాలి. ఎవరి ప్లాన్స్ వారికి ఉంటాయి కదా? శ్రీముఖి ఆర్మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయో.. శ్రీముఖి ఎలాంటి గేమ్ హౌస్ లో ఉండి బయట నుంచి నడపనుందో చూడాలి.