గత వారం నాగార్జున పుట్టినరోజు కానుకగా ఏమైనా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ తప్పించినట్లు ఉన్నారనుకుంటా. లేకపోతే నాగార్జున పుట్టిన రోజు వేడుకలకు స్పెయిన్ లో షికార్లు చేసి రావడానికి వెళ్తే నాగ్ ప్లేస్ లో వచ్చిన రమ్యకృష్ణ ఎలిమినేట్ చేయడానికి వీలు లేదని నాగార్జున ఏమైనా ఆర్డర్ వేశాడో తెలియదు గాని బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయితే లేపేశారు. ఎలిమినేషన్ కార్యక్రమం లేకుండా బిగ్ బాస్ తెలుగు యాజమాన్యాన్ని నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. మేమేమైనా పిచ్చోళ్లమా ఇన్ని రోజులు ఓట్లేయకుండా వెర్రి వాళ్ళను చేయడానికి.. సరే ఎలాగైతే ఇంకో వారం వచ్చేసింది… నాగార్జున సంబరాలు ముగించుకొని హోస్ట్ గా బ్యాక్ టు బిగ్ బాస్ హౌస్ అంటున్నాడు.

ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నది ముచ్చటగా ఐదుగురు… ఒకరేమో అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి కాగా, మిగతా నలుగురు రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా, రవికృష్ణ, ఆలీ రెజా… ఈ ఐదుగురిలో ఆలీ రెజా మొదటి సారి బిగ్ బాస్ హౌస్ లో నామినేట్ అయ్యాడు. ఇంతవరకు నామినేషన్ ఎదుర్కొని కంటెస్టెంట్ గా… మొదటి సారి నామినేషన్ ఎదుర్కొని బయటకు వచ్చేయడానికి సిద్ధమయ్యాడు.

ఈ వారం పడిన ఓట్లలో రవికృష్ణ, ఆలీ రెజా చివరి స్థానాలలో పోటీ పడుతున్నారు. మొదట్లో రవికృష్ణ బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకోగా.. రాను రాను సేఫ్ గేమ్ ఆడుతూ బిగ్ బాస్ ప్రేక్షకులకు విసుగు తెప్పించడంతో అతనికి ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక ఆలీ రెజా విషయానికి వస్తే తన దురుసు ప్రవర్తనతో హౌస్ మేట్ల నుంచే కాకుండా ప్రేక్షకుల ఆదరణను కూడా వేగంగా కోల్పోతున్నాడు. ఇక ఈ పరిస్థితిలో రవికృష్ణకే ఆలీ రేజా కన్నా ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తుంది.

ఒకవైపున టీఆర్పీలు చూస్తే అట్టడుగు స్థాయికి దిగజారుతున్నాయి. హౌస్ లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతూ ఎలాగైనా ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. శ్రీముఖి కూడా పొడిచేస్తది, చించేస్తది అనుకుంటే ఆమె కూడా సరైన పెర్ఫార్మన్స్ ఇవ్వడంలో విఫలమవుతుంది. కానీ అందగత్తె, పాపులర్ కావడంతో పాటు… పైసలు ఎక్కువిచ్చి తీసుకొచ్చారాయె… శ్రీముఖికి ఓట్లైతే దండిగానే పడతాయి.

ఇక హౌస్ లో ఉన్న మిగతా వారిలో ఎవరైతే సరైన పెర్ఫార్మన్స్ చేయడం లేదో వారిని ఎత్తి బయటేసి… ఒక రెండు, మూడు వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో లోపలకు పట్టుకొచ్చి బిగ్ బాస్ రేటింగ్స్ అమాంతంగా లేపాలి చేసే ప్రయత్నాలలో బిగ్ బాస్ యాజమాన్యం ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో… బిగ్ బాస్ రేటింగ్స్ ఎప్పుడు లెగుస్తాయో… బిగ్ బాస్ యాజమాన్యం కళ్ళే ఎప్పుడు చల్లబడతాయో… అంత లోపలున్న కంటెస్టెంట్ ల పెర్ఫార్మన్స్ దయ

  •  
  •  
  •  
  •  
  •  
  •