బిగ్ బాస్ ల యందు తెలుగు బిగ్ బాస్ వేరయా అన్నట్లు ఇప్పుడు వ్యవహారం నడుస్తుంది. బిగ్ బాస్ హౌస్ ఈ ఏడాది లాక్ డౌన్, కరోనా ఎన్నో రకాలుగా లెక్కలు వేసుకొని రేటింగ్స్ లో కొత్త పుంతలు తొక్కుతుందని యాజమాన్యం భావించింది. కానీ బిగ్ బాస్ యాజమాన్యం అనుకున్న దానికి మొత్తం తలకిందులుగా బిగ్ బాస్ సీజన్ 4 మరింత పేలవంగా మారిపోయినట్లు తెలుస్తుంది. తెలిసిన ముఖాలు లేకపోవడంతో పాటు 24 గంటలలో జరిగిన సంఘటనలు గంట సేపు ట్రిమ్ చేసి చూపించేదానిలో కూడా విసుగు పుట్టేలా ఉండటంతో ప్రేక్షకులు అంత ఆసక్తి చూపించడం లేదు. ఇక గతంలో బిగ్ బాస్ హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అయ్యేవి. కానీ ఈ ఏడాది నెటిజన్స్ ఏదో అరకొర ట్వీట్స్ చేస్తున్నారు తప్ప ఈ సోది మనం భరించలేమని చెప్పకనే చెబుతున్నారు.

మరికొన్ని రోజులలో ఐపీఎల్ 13 సీజన్ మొదలు కానుంది. ఇక ఐపీఎల్ మొదలైన తరువాత బిగ్ బాస్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయే అవకాశముందని తెలుస్తుంది. బిగ్ బాస్ లో ప్రస్తుతమున్న మసాలా సరిపోక పోవడంతో పాటు తెలియని ముఖాలు… విషయం లేని బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఇవన్నీ పటాపంచలైపోయి రక్తి కట్టాలంటే ఎవరో ఒక సెలెబ్రెటీలను ప్రతి వారం షోలోకి తీసుకొని వస్తూ హడావిడి చేయాల్సిందే. లేకపోతే బిగ్ బాస్ కెరీర్ లోనే అత్యల్ప రేటింగ్స్ తో వచ్చే ఏడాది నుంచి బిగ్ బాస్ నిర్వహించాలా లేదా అనేదానిపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉంది.

బిగ్ బాస్ ల యందు తెలుగు బిగ్ బాస్ వేరయా అని మనం ముందే చెప్పుకున్నాం. అన్ని బాషలలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి కంటెస్టెంట్స్ పోటీ పడుతుంటే మన దగ్గర ఎంత డబ్బు ఇస్తానని చెప్పినా వెళ్ళడానికి ఇష్టపడటం లేదట. దానికి కారణం ట్రోలింగ్. మన దేశంలో అత్యంత ఎక్కువగా ట్రోలింగ్ చేయగలిగే సత్తా ఉన్న రాష్ట్రాలు ముందుగా తమిళనాడు, మన రెండు తెలుగు రాష్ట్రాల నెటిజన్స్ గుర్తుకొస్తారు. ఒకరిపై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారంటే అది వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా క్షోభకు గురిచేస్తుంది. ఇలాంటి దారుణమైన ట్రోలింగ్స్ బిగ్ బాస్ సీజన్ 2 మరియు 3 లో ఎక్కువగా సెలెబ్రేటిస్ చూడటంతో డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఈ ట్రోలింగ్ భరించడం మావల్ల కాదంటూ బిగ్ బాస్ అంటేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లో తెలియని ముఖాలను తీసుకొచ్చి పైపైకి లేపి టాప్ రేటింగ్స్ లో పెట్టాలని చూస్తే ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రేక్షకులు ఎలా ముందుకొస్తారు చెప్పండి.

శ్రావణి క్రైమ్ కథా చిత్రం రోజుకొక ఊహించని మలుపు