100 రోజుల పైగా సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో రాహుల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. చివరి వరకు తీవ్ర సస్పెన్సు కొనసాగిన ఈ షోలో టైటిల్ గెలుచుకున్నట్లుగా రాహుల్ పేరును నాగార్జున ప్రకటించగా.. ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రాహుల్ కి 50 లక్షల ప్రైజ్ మనీ, ట్రోపిని అందించారు. దీనితో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగిసింది.

ఇక అప్పుడే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి హోస్ట్ గా ఎవరు చేస్తారు అనే దానిపై వార్తలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదటి షోకి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించగా, రెండవ షోకి నాని, మూడవ షోకి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని అందుకే ఫైనల్ కి వచ్చాడని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.