తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో నాలుగు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 3 కంప్లీట్ అవ్వబోతుంది. ఈ బిగ్ బాస్ సీజన్ లో కొత్త టైటిల్ కోసం ఇంటి సభ్యులు మధ్య పోరు రసవత్తరంగా మారింది. అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ విషయంలో కొంచెం లేట్ అయ్యిందట. అందువల్ల ఇప్పటి నుండే వచ్చే తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ విషయంలో లేట్ అవకుండా చూస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు..

నెక్స్ట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి హోస్ట్ గా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. స్టార్ మా, బిగ్ బాస్ నిర్వాహకులు అల్లు అర్జున్ తో త్వరలో అగ్రీమెంట్ కూడా చేయించుకోబోతున్నారట. బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తే బుల్లి తెర ఆడియన్స్ కూడా తమను ఆదరిస్తారనే ఉద్దెశంతో అల్లు అర్జున్ ఉన్నాడట. అందువల్ల అల్లు అర్జున్ బిగ్ బాస్ 4 కి హోస్ట్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. మరి నిజంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కి అల్లు అర్జున్ హోస్ట్ గా చేస్తాడో లేదో అన్నది చూడాలీ. బిగ్ బాస్ మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని హోస్ట్ లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.