బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం వీకెండ్స్ లో శని, ఆది వారాలలో నేరుగా ఇంటి సభ్యులతో మాట్లాడే నాగార్జున దసరా సందర్భంగా బంగార్రాజు గెటప్ లో హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆయన హౌస్ లోకి రాగానే ఇంటి సభ్యులంతా తమ ఆనందం వ్యక్తం చేశారు. కేకలు, ఈలలు, డాన్స్ లతో నాగార్జునకు స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు.

ఈ సందర్భంగా ఇంటి సభ్యులందరికి మిఠాయిలు, బహుమతులు అందచేశారు. మీరంతా నాకు తెలియకుండానే మంచి ఫ్రెండ్స్ అయ్యిపోయారు. మా ఇంట్లో కూడా మీ పేర్లు అన్ని తెలుసు. వాళ్లకు రోజు కూర్చోబెట్టి మీగురించి చెబుతాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక బుధవారం వచ్చే ఎపిసోడ్ లో కూడా నాగార్జున బిగ్ బాస్ లో ఇంటి సభ్యులతో సందడి చేయనున్నారు.