బిగ్ బాస్ తెలుగు సీజన్ మరో రెండు వారాలలో ముగుస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ అయిన సభ్యులు బిగ్ బాస్ డైరెక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ అయిన మహేష్ విట్టా బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలకు తెరతీశాడు.

బిగ్ బాస్ షో నిర్వాహకులు కొందరు ఈ షోను కరెక్టుగా నడపడం లేదని.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మహేష్ ఆరోపిస్తున్నారు. శ్రీముఖికి షో ను అనుకూలంగా కట్ చేస్తున్నారని.. అసలు ఆమె టైటిల్ గెలిచిన ఆశ్చర్యం లేదన్నాడు. తాజాగా మహేష్.. శ్రీముఖిని టార్గెట్ చేసి మాట్లాడటం చర్చకు దారితీస్తుంది. గతంలో కూడా హిమజ.. శ్రీముఖిని టార్గెట్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే.