ప్రేక్షకులను ఎంతగానో ఉర్రుతలూగించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన ఈ షోలో కింగ్ నాగార్జున బిగ్ బాస్ టైటిల్ కి రాహుల్ పేరును ప్రకటించగా మెగాస్టార్ చిరంజీవి 50 లక్షల ప్రైజ్ మనీని, ట్రోపిని అందించారు. ఇక శ్రీముఖి రన్నర్ గా నిలిచింది.

ఇక షో నుండి బయటకు వచ్చిన రాహుల్.. ఇద్దరు లెజెండ్స్ చేతుల మీదగా ఈ ట్రోపిని అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఇప్పటి నుండి నా లైఫ్ వేరే లెవెల్ కి వెళుతుందని.. మధ్యతరగతి నుండి వచ్చిన నాకు లక్షలాది మంది ఓట్లు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక రాహుల్ కి కుటుంబ సభ్యులు, అతని ఫ్రెండ్స్ ఘనంగా స్వాగతం పలికారు. అతని అభిమానులు శాలువా కప్పి సన్మానించారు.

ఇక యుట్యూబ్ ద్వారా గాయకుడిగా కెరీర్ ఆరంభించిన రాహుల్.. సంగీతం కంపోజ్ చేస్తూనే పాటలు పాడేవారు. 2009 వచ్చిన ‘జోష్’ సినిమాతో గాయకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రాహుల్.. అదే సినిమాలో నాగ చైతన్యతో కలసి నటించారు. ఇక ఆ తర్వాత ఈగ, దమ్ము, లై, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సినిమాలలో పాటలు పాడి అలరించారు రాహుల్.