తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ జోరు కొనసాగుతుంది. మొదటి రెండు, మూడు రోజులు బిగ్ బాస్ చప్పగా సాగగా, ఇప్పుడు రసవత్తరంగా మారిపోయింది. ఇక బిగ్ బాస్ చూస్తుండగానే మొదటివారం ఎలిమినేషన్ టైం వచ్చింది. ఇప్పటికే ఈ వారం నామినేషన్ లో గంగవ్వ, సూర్య కిరణ్, సుజాత, మెహబూబ్, దివి, అఖిల్ లు ఉన్నారు. వీరిలో గంగవ్వ సేఫ్ జోన్ లోకి వెళ్లడం గ్యారంటీ. ఇక మిగతావారిలో దివి, అభిజిత్ లు ఈజీగానే సేవ్ అవుతారు. వీరికి భారీగా ఓట్లు పడుతున్నాయని తెలుస్తుంది. ఇక మెహబూబ్ కు కూడా సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తో ఓట్లు పడుతున్నాయంటున్నారు.

ఇక మిగిలిన ముగ్గురు సూర్యకిరణ్, అఖిల్, సుజాతల్లో ఒకరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. వీరి ముగ్గురిలో సుజాత, అఖిల్ మీద ప్రేక్షకులు కొంత సానుకూలంగా ఉన్నారు. కావున ఈవారం హౌస్ నుండి బయటకి వెళ్లే వ్యక్తి సూర్యకిరణే అంటున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.

కనీసం జైలులో ఫ్యాన్ సదుపాయం కూడా ఇవ్వకుండా రియా చక్రవర్తిని వేధిస్తున్నారట

శ్రావణి క్రైమ్ కథా చిత్రం రోజుకొక ఊహించని మలుపు

భారత్ లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. 24 గంటల్లో 97,570 పాజిటివ్ కేసులు