వీ6 న్యూస్ లో వచ్చే తీన్మార్ సావితక్క అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. సత్తితో కలసి  సావిత్రక్క చేసే హడావిడి అంతలా ఉంటుంది. ఇక యూట్యూబ్ లో అయితే సావిత్రక్క – సత్తి చేసే కామెడీ ఎన్ని సార్లు ట్రెండింగ్ అయిందో లెక్కేలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సావిత్రక్కను అక్కినేని నాగార్జున బిగ్ బాస్ లోకి ఆహ్వానిస్తూ శివజ్యోతి అని పిలిచాడు. అసలు ఈ శివజ్యోతి ఎవరురా అని అందరు ముక్కున వేలేసుకున్నారు.

సావిత్రక్క అసలు పేరు… సావిత్రి అని అందుకే అందరూ సావిత్రక్క అని పిలుస్తారని ఇప్పటి వరకు ప్రేక్షకులు అందరూ భావిస్తున్నారు. కానీ వీ6 ఛానల్ వారు మాత్రం సావిత్రక్క అనేది మా పేరు అని దానిని వాడటానికి వీలు లేదని.. తమ ప్రోగ్రాం కోసం తాము ఆ పేరుని పాపులర్ చేశామని బిగ్ బాస్ యాజమాన్యానికి నోటీసులు పంపారని గుసగుసలు వినపడుతున్నాయి. సావిత్రక్క అనే పేరు ఎవరు వాడటానికి వీల్లేదని గట్టిగా చెప్పడంతో, ఇప్పటికే శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా, ఓయూ స్టూడెంట్స్ గొడవలతో పాటు కోర్ట్ కేసులతో అల్లాడుతున్న బిగ్ బాస్ యాజమాన్యం మరో సారి తలకు బొప్పి కట్టించుకోవడం ఎందుకని సావిత్రక్కకు… నువ్వు శివజ్యోతిగానే బిగ్ బాస్ లో పాపులర్ అవ్వాలని చెప్పడంతో సావిత్రక్క కూడా అలానే ఫిక్స్ అయిపోయి శివజ్యోతిగా తన పేరుని బిగ్ బాస్ అభిమానులకు తన అసలు పేరు పరిచయం చేసుకుంది

 
  •  
  •  
  •  
  •  
  •  
  •