రేపటి నుంచి తెలుగు బిగ్ బాస్ షో మొదలుకానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే బిగ్ బాస్ కు సంబంధించి పార్టిసిపెంట్స్ పేర్లు బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడు ఒక వీడియో ద్వారా విడుదల చేసాడు. ఇక బిగ్ బాస్ కు సంబంధించి మరొక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. గత బిగ్ బాస్ 2 లో గూగుల్ ఓటింగ్ సిస్టంలో ఉన్న లొసుగులను చాల మంది కంటెస్టెంట్స్ వాడుకొని వారికి నచ్చిన వారిని హౌస్ లో ఉంచుతూ నచ్చని వారిని బయటకు పంపించడం చూసే ఉంటాం.

ఇక దీనికి సంబంధించి పరిష్కారం కనుగొన్న బిగ్ బాస్ ఈసారి హాట్ స్టార్ ద్వారా మరియు ఫోన్ లైన్ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ చేపట్టనున్నారని తెలుస్తుంది. హాట్ స్టార్ మరియు ఫోన్ లైన్ అయితే కొంత మేర నిజాయితీగా ఉంటుందని ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రేక్షకులను మరింత రక్తి కట్టించేలా చేయడానికి బిగ్ బాస్ యాజమాన్యం తగు చర్యలు తీసుకుంటుంది. 

 
  •  
  •  
  •  
  •  
  •  
  •