సెప్టెంబర్ 6 నుండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని స్టార్ మా ఛానల్ ప్రచారం చేస్తుంది. ఈ సీజన్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరందరిని ముందు 16 రోజుల పాటు క్యారంటైన్ లో ఉంచి ఆ తరువాత కరోనా టెస్టులు చేసి హౌస్ లోకి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో పొల్గొంటున్న 16 మంది కంటెస్టెంట్లులో ఎవరికి ఎక్కువ పే చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ 16 మంది కంటెస్టెంట్లులో యాంకర్ లాస్య కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. జెమినీ టీవీ, మాటీవీ లలో యాంకర్ గా చేసిన లాస్య పలు షోల ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఆమెకు రోజుకు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఉన్న కంటెస్టెంట్లులో లాస్యాకే ఎక్కువ పాపులారిటీ ఉంది. ఇక లాస్య స్వస్థలం వైఎస్సార్ జిల్లా, వీరబల్లి మండలం, గడికోట గ్రామం. ఇక లాస్య తను ప్రేమించిన మంజునాథ్ 2010 లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

lasya

కరోనా నివారణకు డాక్టర్ రెడ్డీస్ కొత్త ఔషదం..!

‘వకీల్ సాబ్’లో భారీ మార్పులపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!