తెలుగులో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుని మంచి పాపులారిటీని సంపాదించుకున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్. అయితే ఈ షో మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కు నాని, మూడవ సీజన్ కు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక నాలుగవ సీజన్ 2020 కి ఎన్టీఆర్, చిరంజీవి పలువురు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారని గతంలో వార్తలు వచ్చాయి.

కానీ బిగ్ బాస్ నాలుగవ సీజన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుల్లితెరపై కనిపించడానికి మహేష్ చాలా ఆసక్తి కనపరుస్తున్నాడట. అందులో భాగంగా ఒప్పందంపై కూడా సంతకాలు చేయడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తుంది. గత సీజన్ల కంటే బిగ్ బాస్ 4 బిన్నంగా ఉంటుందని.. ఈ సారి షో పార్మెట్లను కూడా మార్చబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారంగా ఉంది.