బిగ్ బాస్ తెలుగు సూపర్ రేటింగ్స్ తో దూసుకుపోతుండటంతో బిగ్ బాస్ ఏమాత్రం వెనక్కు తగ్గేలా లేడు. వైల్డ్ కార్డు ఎంట్రీలతో ఒక పక్కా ప్లాన్డ్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించి రచ్చ లేపుతున్నాడు. ఇప్పటికే ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి రాకతో హౌస్ లో గ్రూపులతో పాటు గొడవలు స్టార్ట్ అయ్యాయి. తమన్నా ఒక టాస్క్ లో ఆలీ రెజా, ఆశు రెడ్డిని దారుణంగా విమర్శించడంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న ఆలోచన పక్కన పెట్టి… అంతకన్నా ముందుగా హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో రాబోతున్న శ్రద్ధా దాస్ పై బిగ్ బాస్ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.   

బిగ్ బాస్ హౌస్ లోకి శ్రద్ధా దాస్ రావడంతో మరికొంత గ్లామర్ ను యాడ్ చేయడమనే చెప్పుకోవచ్చు. శ్రద్ధా దాస్ సినిమాలలో పొట్టి పొట్టి నిక్కర్లతో యువతను గిల్లి కజ్జాలు పెడుతూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే రేంజిలో పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. శ్రద్దా దాస్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో వరుణ్ – వితికాల మధ్య లుకలుకలు వచ్చే అవకాశం ఉందా అనిపిస్తుంది.

కారణం శ్రద్ధా దాస్ – వరుణ్ సందేశ్ ఇద్దరు కలసి “మరో చరిత్ర” అనే సినిమాలో నటించారు . ఆ సినిమా జరుగుతున్నప్పుడు శ్రద్ధా దాస్ – వరుణ్ సందేశ్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని… ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో ఉందని పుకార్లు వచ్చాయి. ఇక ఆ తరువాత కొన్ని రోజులకు వారిద్దరికి బ్రేక్ అప్ అవ్వడం, వరుణ్ సందేశ్ వితికాను ప్రేమించి పెళ్లిచేసుకోవడం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు శ్రద్ధా దాస్ ను కావాలనే బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించి గిల్లి కజ్జాలు ముగ్గురి మధ్య పెట్టనున్నాడా అనిపిస్తుంది.

దీనికి సంబంధించి బిగ్ బాస్ గేమ్ ఎలా నడిపిస్తాడు అన్నదే కొంత ఆసక్తిగా మారింది. ఒకవేళ శ్రద్ధా దాస్ ఎంట్రీతో వితికాను ఈ వారం ఎలిమినేట్ చేసి బయటకు పంపి బిగ్ బాస్ వరుణ్ – శ్రద్ధా దాస్ ల మధ్య మరోసారి ప్రేమను చిగురిస్తాడా లేక… శ్రద్ధా దాస్ హౌస్ లోకి వస్తుండటంతో వితికను కూడా హౌస్ లోనే ఉంచి వారి ముగ్గురు మధ్య ఏదైనా గొడవలు పెట్టి హౌస్ లో వేడి పుట్టిస్తాడా అన్నది ఈ వారం ఎలిమినేషన్ కమ్ శ్రద్ధా దాస్ వైల్డ్ కార్డు ఎంట్రీతో తేలనుంది. బిగ్ బాస్ నువ్వు నిజంగా బిగ్గర్ బాస్ వే సామి… నీ ప్లాన్ అదుర్స్  
  •  
  •  
  •  
  •  
  •  
  •