బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన హేమ మొదటి వారంలోనే ఆ షో నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ షో నుండి బయటకు రాగానే బిగ్ బాస్ పై, ఇంటి సభ్యులపై హేమ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ మరోసారి బిగ్ బాస్ నిర్వాహకులపై, కంటెస్టెంట్ శ్రీముఖిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ సమయంలో తన గురించి పూర్తి ఏవి చూపించలేదని, తన ఎంట్రీని దరిద్రంగా మార్చారని.. బిగ్ బాస్ నిర్వాహకులపై మండి పడింది. అలాగే శ్రీముఖి బయట ఒకలా లోపల మరోలా మాట్లాడుతుందని.. అసలు శ్రీముఖి ఆడుతున్న గేమ్ లో అందరూ బలవుతున్నారన్నారు. శ్రీముఖికి అనుకూలంగా షో కట్ చేస్తున్నారని.. ఆమె చెప్పినట్లు బిగ్ బాస్ యాజమాన్యం అనుసరిస్తుందన్నారు. శ్రీముఖి బర్త్ డే నాడు అందరూ కలసి పార్టీ చేసుకున్నారని.. అప్పుడే తనను పంపించాలని డిసైడ్ అయ్యారని హేమ ఆరోపించింది.

తాను స్ట్రాంగ్ గా మారుతున్నానన్న ఉద్దెశంతో ఇంటి సభ్యులందరు నన్ను బయటకి పంపించడమే టార్గెట్ గా పెట్టుకున్నారన్న హేమ.. అందుకోసమే నాతో వారు గొడవ పెట్టుకున్నారన్న విషయం నాకు తర్వాత అర్థమైందన్నారు. హిమజ ఎలిమినేట్ అయిన తర్వాత తాను బిగ్ బాస్ చూడడమే మానేశానన్నారు. అక్కడ షో ఎడిటరే బిగ్ బాస్ అని.. తనకి ఫైనల్ కి రావాలని పిలుపు వచ్చిందని కానీ మరోసారి తాను అవమాన పడడం ఇష్టం లేక తిరస్కరించానన్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •