శనివారం టీం ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధనా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, పేసర్‌ భువనేశ్వర్ కుమార్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు స్మృతి మంధనా. ఆటలో ఇలాగె రాణించాలి. భారత్ జట్టులో ఎడమ చేతి వాటం గల బ్యాట్స్‌మెన్ చాలా ఖ్యాతిని కలిగి ఉంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి’ అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేసాడు. ఇక ఆమె పుట్టిన రోజు సందర్భంగా ‘బ్యాట్‌ వింత్‌ టాలెంట్‌ ప్లేయర్’ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

ఇక స్మృతి మంధనా ఇప్పటివరకు 51 వన్డేలలో 43.1 సగటుతో 4 సెంచరీలు చేసి 2025 పరుగులు సాధించింది. వన్డేలలో వేగంగా 2000 పరుగుల మైలు రాయిని సాధించిన క్రికెటర్ గా రికార్డు సాధించింది. 75 టీ20 మ్యాచ్‌లు ఆడి 25.2 సగటుతో 1716 పరుగులు రాబట్టారు. అంతేకాకుండా 2018 లో ఐసీసీ ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్ గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

నితిన్ పెళ్లి ముహూర్తం ఖరారు

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ..!