ఇద్దరు బాలలు బిర్యానీ కోసం ఏకంగా గుడిలో హుండినే పగలగొట్టి డబ్బులు దొంగతనం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ఆంజనేయస్వామి గుడిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పలుగుతో హుండీని ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జగన్నాధపురానికి చెందిన ఇద్దరు బాలలు దొంగతనం చేసినట్లుగా తేల్చారు.

వారిని విచారించిన పోలీసులు.. బిర్యానీ తినాలన్న కోరికతోనే గుడిలో హుండీ పగలగొట్టి అందులోని రూ.140 తీసుకున్నామని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇక వారిని అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ విలేకర్లతో మాట్లాడుతూ.. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో తరుచుగా దొంగతనాలు జరుగుతూనే ఉంటాయని.. కేసులు నమోదవుతుంటాయని తెలిపారు.

మళ్ళీ తగ్గిన బంగారం ధర.. భారీగా పతనమైన వెండి..!

భార్యను కొట్టడంతో కొలువు పోగొట్టుకున్నాడు.. వీడియో వైరల్..!

సూపర్ ఓవర్లో బయటపడ్డ ఆర్సీబీ..!