సీఎం జగన్ కాళ్ళ వేళ్ళ బతిమిలాడుకొని ఎలాగోలా నర్సాపురం ఎంపీ టికెట్ సంపాదించిన రఘురామకృష్ణ రాజు, గెలిచిన వెంటనే తోకజాడించడం మొదలు పెట్టాడు. తాను ఎవరి దయ దాక్షణ్యాలతో గెలవలేదని, తాను తన బలంతోనే గెలిచానని విర్రవీగడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే రఘురామకృష్ణ రాజుపై అనర్హత పిటిషన్ పార్లమెంట్ స్పీకర్ కు ఇచ్చారో అప్పటి నుంచి తన నోటి దురుసు తగ్గించుకున్నట్లు కనపడినా మరలా ఈమధ్య పిచ్చి ప్రేలాపనలతో ఏదేదో మాట్లాడుతూ ఎప్పుడు మీడియా లైమ్ లైట్ లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.

వైసీపీ నాయకులు ఎప్పుడైతే పార్లమెంట్ స్పీకర్ ను కలసి అతడి పదవికి ఎసరు పెట్టేలా ముందుకు వెళ్లాలని చూసారో అతడు బీజేపీ అధినాయకత్వాన్ని కలసి తాను బీజేపీలో చేరుతానని, తన పదవికి ఎటువంటి డోకా రాకుండా చూసుకోవాలని కోరడం జరిగింది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి గెలిచి చేరవచ్చని చెప్పడంతో అతడు కంగుతినంత పనైంది. ఆ తరువాత కొంత సైలెంట్ గా ఉన్నా, వైసీపీ నాయకులు రఘురామకృష్ణ రాజుపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని వారి రూట్ లో వారు పావులు కదుపుతుండటంతో అతడు మరోసారి బీజేపీ అధిష్టానానికి విన్నవించుకున్నాడట.

దయచేసి నన్ను పార్టీలో చేర్చుకోండని, చాలా రాష్ట్రాలలో పక్క పార్టీల వారిని చేర్చుకుంటున్నారు కదా, ఏపీలో కూడా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకున్నారు కదా, తనను మీ పార్టీలో చేర్చుకొని తన పదవి ఊడకుండా కాపాడాలని కోరితే బీజేపీ అధిష్టానం మాత్రం ససేమీరా అంటుందట. దీనికి కారణం రఘురామకృష్ణ రాజు తలబిరుసు తనమనే తెలుస్తుంది. అతడు ముందుగా వైసీపీ పార్టీలో చేరి ఆ తరువాత టీడీపీ, బీజేపీ, వైసీపీ ఇలా వరుస పెట్టి అన్ని పార్టీలు మారుతూ పట్టుమని ఒక్క ఏడాది కూడా ఎక్కడ నిలబడలేకపోయాడు. దీనితో పాటు తనను ఎవరు ఏమి చేయలేరన్న తలబిరుసు తనం కూడా ఉండటంతో ఇతడితో ఎప్పటికైనా డేంజర్ అని రిపోర్ట్స్ వెళ్లడంతో అతడికి నై నై అనడంతో ఆ సహనం తట్టుకోలేక వైసీపీ పార్టీపై మరింత తన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈరోజు ఎగిరెగిరి పడితే, రేపో మాపో అనర్హత పిటిషన్ నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. అది గుర్తించకుండా వైసీపీ పార్టీతో మరింత కయ్యానికి దిగుతూ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడు.