సీఎం జగన్ గతంలో చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయిందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. ఆయన గుంటూరు లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ అలాగే ఉందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు ఏళ్ళ సంగతి గురించే మాట్లాడుతున్నారు తప్ప ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పాలన్నారు.

100 రోజులలోనే జగన్ పరిపాలన పై పట్టు కోల్పోయారని.. అసలు రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. రైతులకి 12000 పెట్టుబడి ఇస్తామన్న జగన్.. కేంద్రం ఇచ్చే డబ్బులు అందులో కలిపారని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. ఇప్పటికి కూడా ఇసుక దొరకట లేదని ఆన్లైన్ విధానం పనిచేయట లేదన్నారు.

అసలు జన్మభూమి కమిటీల పేరు మార్చి వాలంటీర్లను తీసుకువచ్చారని.. అది వైసీపీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమేనని అన్నారు. అసలు రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను కుదేలు చేశారన్నారు. సహకార రంగంలో కూడా ఎన్నికలు జరిపే దైర్యం వైసీపీ ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు కన్నా లక్ష్మి నారాయణ.

  •  
  •  
  •  
  •  
  •  
  •