దేశవ్యాప్తంగా లోక్ సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఈనెల 19 వ తారీకుతో అన్ని రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. ఇక ఆరోజు సాయంత్రమే దేశవ్యాప్తంగా ఏపార్టీ అధికారంలోకి రానున్నది అన్న ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలకానున్నాయి. ఇప్పటికే మొదటి విడతలోనే ఎన్నికలను ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళితో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయం సుస్పష్టమైంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ దాదాపుగా 20 స్థానాలకు పైగా పార్లమెంట్ సాహన్లను కైవసం చేసుకోనుందని తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఒక అంచనాకు వచ్చాయి.

ఇందులో భాగంగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం బీజేపీతో పాటు, కాంగ్రెస్ పార్టీ కూడా మచ్చిక చేసుకుకోవడానికి ఇప్పటికే వివిధ పార్టీలు తమ అనునాయులను లోటస్ పాండ్ కు పంపించినట్లు తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో ఈసారి హంగ్ రాబోతుందన్న సంకేతాలతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దాదాపుగా 20 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోనుండటంతో తమ చూపులు వైసీపీ పార్టీపై గట్టిగానే వేసాయి. కానీ వైఎస్ జగన్ మాత్రం మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారో వారికే తమ మద్దతు అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

ఒక వేళ దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలలో హంగ్ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు వైఎస్ జగన్ రూపంలో తీరినట్లే. అలా కాకుండా వైఎస్ జగన్ మెప్పుపొంది అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం బీజేపీ కనుక ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పితే మాత్రం వైఎస్ జగన్ చేతిలో చావు దెబ్బ తినడంలో ఎటువంటి సందేహం ఉండదని వైఎస్ జగన్ ను మొదటి నుంచి గమనిస్తున్నవారు చెబుతున్న మాట. ఇచ్చిన మాటకు వైఎస్ జగన్ ఎంతలా కట్టుబడి ఉంటాడో, అలానే వైఎస్ జగన్ కోరుకున్న ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పరుచుకున్న తరువాత మోసం చేస్తే వెంటనే ప్రభుత్వం నుంచి బయటకు రావడానికి కూడా వైసీపీ అధినేత వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదని తెలుస్తుంది. అందుకే కమలనాధులు వైఎస్ జగన్ తో కొంత జాగ్రతగా ఉండాలని ఇచ్చిన మాట నెరవేర్చగలం అనుకునప్పుడే వైఎస్ జగన్ తో సఖ్యత కొనసాగించి ముందుకు పోవాలని ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ పార్టీ పెద్దలు హితవు పలుకుతున్నారట.