బీజేపీ సొంతగా అధికారాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు వారి కన్ను ఆంధ్రప్రదేశ్ పై పడింది. ఏపీలో ఎలాగైనా వచ్చే ఎన్నికల సమయానికి పాగా వేయాలని కృత నిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి నాలుగు రాజ్యసభ సభ్యులను తీసుకొని, ఎమ్మెల్యేలను కూడా లాగి వైసీపీ పార్టీకి ప్రతిపక్షంగా తామే ఉండాలని భావిస్తుంది.

బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా ఏపీ రాజకీయాలు కులాల రొచ్చులో మునిగి తేలుతున్నాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి అండగా కమ్మ కులాన్ని పూర్తిగా తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తుంది. కమ్మ కులం అండతో పాటు ఆ కులం వారు పారిశ్రామికంగా ఎంతో ముందుకు దూసుకుపోయారు. కుల, ధన ప్రభావంతో వచ్చే ఎన్నికలలో ఏపీలో సత్త చాటాలంటే కమ్మ కులానికి చెందిన ప్రముఖ నేతలను చేర్చుకోవడం ఒక్కటే సరైన నిర్ణయం అని భావిస్తున్నారట.

కమ్మ కులానికి చెందిన నేతలు కూడా ఈ ఐదు సంవత్సరాల పాటు వైఎస్ జగన్ ప్రభుత్వంతో తల నొప్పులు తెచ్చుకోవడం కన్నా బీజేపీలోకి వెళ్లి కేసులు, ఇతరత్రా వాటి నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తరువాత పార్టీని ముందుకు తీసుకెళ్లేది ఎవరన్న దాని మీద స్పష్టత లేదు. చంద్రబాబు కొడుకు లోకేష్ వల్ల తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. జూనియర్ ఎన్టీఆర్ తో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి అనుకుంటే దానికి బాబు ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇన్ని తలపోటులా మధ్య బీజేపీ అయితేనే సేఫ్ అని అనుకుంటున్నారు.    

బీజేపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ బీజేపీలో ప్రధాన భూమిక పోషిస్తున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు, సుజనా చౌదరి లాంటి వారు కూడా తెలుగుదేశంలో కమ్మ నేతలను బీజేపీలోకి ఆహవనిస్తున్నారట. కమ్మ కులానికి చెందిన వారు కూడా మన కులానికి చెందిన పార్టీ కన్నా కమలం లాంటి పెద్ద పార్టీనే మేలని భావిస్తున్నారు. దానిని బీజేపీ కూడా తనకు అనుకూలంగా మలుచుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి వైసీపీ పార్టీకి దీటుగా బీజేపీ పార్టీనే ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
  •  
  •  
  •  
  •  
  •  
  •