వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీ ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని, లేకపోతే కనీసం చెప్పుకో తగ్గ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో ఏపీలోని తెలుగుదేశం పార్టీ నేతలను చేర్చుకునే పనిలో బిజీ బిజీగా ఉంది. ఇక బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఒక సంచలన విషయాన్ని బయట పెడుతూ వైసీపీ కి చెందిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తమతో టచ్ లో ఉన్నాడని బాంబు పేల్చాడు. బొత్సతో పాటు శ్రీకాకుళానికి చెందిన సీనియర్ నేత వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు చెప్పారని ఒక ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది.

ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ముఖ్యనేతలు తమతో టచ్ లో ఉన్నారని, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కూడా మంతనాలు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ మాధవ్ సంచలనం కోసం ఇలా చెప్పారా లేక నిజంగానే వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది. 

బొత్స సత్యనారాయణ ఏపీలో కీలకమైన మంత్రి పదవిని చేపట్టారు. అలాంటి బొత్స కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పడం సాహసోపేతమే… ఇక ధర్మాన ప్రసాద రావు తనకు మంత్రి పదవి దక్కలేదని కొంత అలక పాన్పు ఎక్కారని తెలుస్తుంది. మొదటి నుంచి వైఎస్ జగన్ తో నడిచిన అతని సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ కు మంత్రి పదవిని జగన్ కట్టబెట్టారు. ఇక ఎమ్మెల్సీ రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.  


Tags: Bjp, ysrcp


  •  
  •  
  •  
  •  
  •  
  •