ఏపీలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైపోయిందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియాలో కూడా అనేక వార్తలు వచ్చాయి. ఇక ఏపీ బీజేపీ నేతలు కూడా టీడీపీ పార్టీని పట్టించుకోవడం మానేసి వైసీపీ పార్టీ టార్గెట్ గా రాజకీయాలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కాపులకు ఎర వేయడానికి సోము వీర్రాజుకి ఏపీ బీజేపీ అధ్యక్షా పదవి కట్టబెట్టి ఆ వర్గం నేతలను సంతృప్తి పరిచిన బీజేపీ అగ్రనాయత్వం ఇప్పుడు కమ్మలవైపు కూడా గురిపెట్టి పురంధేశ్వరికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉండే ప్రధానకార్యదర్శి పదవిని కట్టబెట్టారు.

ఏపీలో కమ్మలకు గాలం వేయడానికి పురందేశ్వరికి ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెడితే, తెలంగాణాలో రెడ్డి ఓట్లకు గాలం వేయడానికి డీకే అరుణను బీజేపీ నాయకత్వం జాతీయ ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించారు. డీకే అరుణ తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని, తాను టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటానని సెలవిచ్చిన పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న ఎంపీ బండి సంజయ్ దగ్గరే ఉంచి ఆమెను జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. ఇలా ఒకవైపున రెడ్డి మరొక వైపు కమ్మలకు జాతీయ స్థాయిలో పదవులు కట్టబెట్టి ఆ ఓట్లను తన వైపు తిప్పుకునేలా బీజేపీ అగ్రనాయత్వం తనదైన రీతిలో పావులు కదుపుతుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

అప్పుడు ఘంటసాలకు జరిగిన అవమానం ఇప్పుడు బాలుకి జరిగిందని అభిమానుల ఆవేదన

విలాసాలనే మాట నేను ఎప్పుడో మర్చిపోయానంటున్న అనిల్ అంబానీ