జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం బీజేపీ పార్టీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత ఎన్నికలలో ఘోర పరాజయం చెందడంతో పవన్ కళ్యాణ్ తిరిగి ఈమధ్యే ప్రజల మధ్యకు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ను ఎన్నికల తరువాత బీజేపీలో విలీనం చేయాలని ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదనలు పంపుతున్నారు. కానీ పవన్ దానికి అంగీకరించకపోగా ఆ విషయాన్ని బయటకు చెప్పి సంచలనం కలిగించాడు. 

తనను ఒక జాతీయ పార్టీ బీజేపీలో విలీనం చేయమని అడుగుతుందని, కానీ తన ప్రాణమునంత వరకు జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేసే ప్రశ్ననే లేదని అన్నాడు. కానీ బీజేపీ పార్టీ సభ్యులు మాత్రం ఏపీలో బలపడాలంటే ఒక కులానికి సంబంధించిన ఓట్లు మన వెనక ఉండాలని, పవన్ కళ్యాణ్ అయితే కరెక్ట్ గా సరిపోవడమే కాకుండా అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా అన్ని కలసి వస్తే బీజేపీని ఏపీలో ఎప్పటికైనా మంచి స్థానంలోనిలబెట్టవచ్చని బావిస్తున్నారట. 

కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి తన మనసులో మాట బయటపెట్టకపోయే సరికి నేరుగా చిరంజీవిని పేరు ప్రతిపాదించారు. బీజేపీలో కనుక జనసేన పార్టీని విలీనం చేస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం అభ్యర్థిగా చిరంజీవి పేరు ప్రతిపాదిస్తామని  తెలియచేయడంతో పవన్ కళ్యాణ్ కాస్త మెత్తబడ్డాడట. తన అన్న కోసం తాను ఏదైనా చేస్తానని చెప్పే పవన్ కళ్యాణ్, చిరంజీవిని సీఎంగా చూసుకోవాలని ప్రజారాజ్యం సమయంలో కలలు కంటే అది నెరవేరలేదు. 

బీజేపీ ద్వారా ఏమైనా అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా అన్న రీతిలో ఆలోచన మొదలుపెట్టారని తెలుస్తుంది. మరోవైపున చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదలైన తరువాత ఈ విషయంపై ఏమైనా క్లారిటీ రాలేదు. బీజేపీ ఆఫర్ విషయంలో చిరంజీవి కూడా ఎక్కడ నోరు జారలేదు. తనకు ఏమి పట్టనట్లు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. 

బీజేపీ పార్టీ సౌత్ ఇండియాలో పాగా వేయడానికి గట్టి ప్రయత్నాలలో ఉంది. వచ్చే ఎన్నికలలో సమయానికి తనకంటూ స్థానాన్ని ఏర్పరుచుకోవడానికి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే తమిళనాడులో రజనీకాంత్ ను చేర్చుకొని అతనిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని నిర్ణయిస్తున్నారు. ఇక తెలంగాణాలో తమిళనాడుకు చెందిన బీజేపీ లీడర్ తమిళసై ను తీసుకువచ్చి తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమించడం వెనకాల తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టే వ్యూహాలు ఉన్నాయని తెలుస్తుంది. 

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీష్ రావు లాంటి నేతలను దువ్వుతుంది. ఇలా సౌత్ పరంగా పట్టుసాధించడంతో పాటు, వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తన ప్రయత్నాలు ముమ్మరం చేయడం వెనక బీజేపీ దేశంమొత్తం హావ చూపించాలని ఉవ్విళూరుతుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •