ఆపదలో ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఓ వ్యక్తిని అన్యాయంగా చంపేశారు. ఈ దారుణ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఒక ఆఫ్రికన్అమెరికన్ వ్యక్తి మెడపై పోలీస్ ఒకరు మోకాలితో తొక్కి పెట్టడంతో అతను ఊపిరాడక చనిపోయాడు. ‘దయచేసి నా గొంతు మీద కాలు తీయండి. ప్రాణం పోయేలా ఉంది వదిలి పెట్టండి సార్’ అని అతడు విలవిలలాడుతూ వేడుకున్నా కూడా ఆ పోలీస్ కనికరించలేదు. దీంతో అతను ఊపిరాడక మృతి చెందాడు.

ఈ దారుణ సంఘటన అమెరికాలో సోమవారం జరిగింది. దీని పూర్తి వివరాలలోకి వెళ్తే.. అమెరికాలోని మినియాపొలిస్ ప్రాంతంలో పోలీసులు ఓ ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో పోలీసులకు 46 ఏళ్ళ జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ కనిపించాడు. ఇక వెంటనే కారులో నుండి అతన్ని దిగి రావాలని ఆ పోలీస్ ఆదేశించాడు.

ఇక జార్జ్ బయటకి రాగానే నెల మీద బలవంతంగా పడుకోబెట్టారు. సంకెళ్లు వేసి అతని మెడపై పోలీస్ అధికారి కాలుతో తొక్కడం మొదలుపెట్టాడు. ప్రాణం పోతుందని చెప్పినా కూడా ఆ పోలీస్ కనికరించలేదు. అతనిలో మెల్లగా చలనం ఆగిపోతున్నాకూడా ఆ పోలీస్ అతని మెడపై కాలు తీయలేదు. వైద్య సిబ్బంది స్ట్రెచర్ తెచ్చేవరకు అతని గొంతుపై పోలీస్ అధికారి కాలు తీయలేదు. ఆ తరువాత అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక ఈ ఘటన పట్ల పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక అతని మరణానికి కారణమైన నలుగురు పోలీసులను విధుల్లో నుండి తొలగించినట్లు ఉన్నతాధికారులు తెలియచేసారు.

సొంతూర్లకు వెళ్ళడానికి పశువులు అమ్మి విమాన టికెట్స్ కొన్నారు.. అయినా కూడా..!

గుర్రానికి కరోనా వైరస్.. క్యారంటైన్ కి తరలించిన డాక్టర్లు..!