మణిపూర్ బ్లాక్ రైస్ కు అరుదైన గుర్తింపు వచ్చింది. ‘చాఖావో’గా ప్రసిద్ధి గాంచిన ఈ బ్లాక్ రైస్ భౌగోళిక సూచిక(జిఐ) ట్యాగ్ పొందినట్లు అధికారవర్గాలు తెలియచేశాయి. శతాబ్దాలుగా మణిపూర్ లో సాగులో ఉన్న ‘చాఖావో’ అనే సువాసన గల గ్లుటినస్ వారి నుండి సువాసన కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే విందులో వాడతారు. దీని ‘చాఖావో బీర్’ అని కూడా అంటారు. ఇక ఈ మణిపూర్ రైస్ కి జిఐ ట్యాగ్ ఇవ్వాలంటూ మణిపులోని చాఖావో కన్సార్టియమ్ ప్రొడ్యూసర్స్ ఏడాది క్రిందట దరఖాస్తు చేసుకుంది. దీనికి వ్యవసాయశాఖ మణిపూర్ ప్రభుత్వం తో పటు నార్త్ ఈస్టర్న్ రీజినల్ అగ్రికల్చురల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్దతుగా నిలిచాయి. ఇక రాష్ట్ర వ్యవసాయశాఖ బృంద సభ్యుల డాక్యుమెంటేషన్ తో సహా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఏడాది పైగా సమయం పట్టిందని అధికారులు తెలియచేసారు.

ఇక మణిపూర్ బ్లాక్ రైస్ జిఐ ట్యాగ్ ను పొందడం అరుదైన విషయం అన్నారు మణిపూర్ అగ్రి బిజినెస్ కన్సార్టియమ్ ఎమ్‌ఎస్‌ ఖైదెం. ఇప్పుడు బ్లాక్ రైస్ విత్తనాలను ప్రపంచంలో ఎక్కడైనా అమ్మే శక్తీ తమకు ఉందన్నారు. ఇక వాణిజ్య పరంగా మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు తాము అధిక ప్రోటీన్ కంటెంట్ స్థానిక బఠాణి రకం ‘హావాయి తారక్ మఖ్యత్ముబి’ జిఐ ట్యాగ్ లభించే విధంగా పక్రియను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖైదెం పేర్కొన్నారు.

కరోనా వైరస్ పై తాజాగా స్పందించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ..!

ప్రతి ఒక్కరిని కదిలించి కన్నీరు తెప్పించే వార్త

ఒకేఒక్క ట్విట్ వల్ల 1400 కోట్ల నష్టం వచ్చింది..!