నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కరోనా ముందే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10న ఈ టైటిల్ అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’, ‘లెజండ్’ సినిమాలు మంచి హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

సీఎం జగన్ మనస్తత్వం ఎలాంటిదో సింధు విషయంలోనే తెలుస్తుంది

మరో షాకింగ్ విషయాన్నీ బయటపెట్టిన శాస్త్రవేత్తలు.. వాటితో చాలా ముప్పు..!