బాలీవుడ్ యువనటుడు మోహిత్ బఘెల్(26) శనివారం క్యాన్సర్ తో మృతి చెందినట్లు రచయత, దర్శకుడు రాజ్ శాండిల్య తెలిపారు. మోహిత్ గత ఆరు నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ నెల 15న అతనితో మాట్లాడానని అప్పుడు అతను బాగానే ఉన్నాడని చెప్పారు.

ఇక అతను క్యాన్సర్ నుండి కొంత కోలుకుంటున్న తరుణంలో హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి అతని తల్లిదండ్రులు  అన్నయ్యతో కలసి ఉంటున్నాడు. అయితే ఇంతలోనే మా ఇద్దరికి స్నేహితుడైన ఓ వ్యక్తి ద్వారా ఆయన మరణవార్త తెలిసిందని రాజ్ శాండిల్య తెలిపారు. ఇక బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కలసి ‘రెడీ’ సినిమాలో నటించాడు మోహిత్ బఘెల్.

తెలంగాణలో 1800 దాటిన కరోనా పాజిటివ్ కేసులు.. 49 మృతులు..!

నాగార్జునతో శేఖర్ కమ్ముల..?