బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు తెలియచేసారు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో భాదపడుతున్నారు సంజయ్ దత్. ఊపిరిపీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న సంజయ్ దత్ ను సన్నిహితులు వెంటనే ముంబైలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. ఆయనకు కరోనా సోకిందేమోనని పరీక్షలు చేశారు. అయితే కరోనా రిపోర్టు నెగిటివ్ గా వచ్చింది. ఇక డాక్టర్లు సంజయ్ కి అన్ని రకాల పరీక్షలు చేస్తే రిపోర్టులు మంగళవారం వచ్చాయి. వాటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. అది కూడా స్టేజ్ 3లో ఉందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన వయసు 61 సంవత్సరాలు. ఇక మెరుగైన వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్లనున్నారు.

ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..!

పవన్ కళ్యాణ్ సినిమాలో పునర్నవి ..?

సంచలనంగా మారిన రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్