బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ భర్త అందగా ఉండడని, ఆయన చాలా అందవిహీనంగా ఉంటాడంటూ ఓ అమెరికన్ మహిళ ఇన్ఫుఎన్సర్ సోషల్ మీడియా వేదికైన ఇంస్టాగ్రామ్ ద్వారా వ్యాఖ్యలు చేసింది. దీనిపై సోనమ్ ఘాటుగా స్పందించింది. నా దృష్టిలో పడడానికి నువ్వు ఇలాంటి సందేశాలు పంపావని తెలుసు. దీని ద్వారా నువ్వు పాలొవర్స్ ను సంపాదించాలనుకుంటున్నావు. ఈ మహిళ నాకు నీచమైన మాటలు పంపింది. ప్రజల మెదడులు ఇలా పనిచేస్తున్నాయేంటి.. ఆమె వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చాలా బాధించాయి కూడా. ఈ విధంగా ఆమె మాట్లాడితే ఆమెను ట్యాగ్ చేస్తానని.. చీఫ్ ట్రిక్స్ ఉపయోగించింది. ఇంత ద్వేషాన్ని మనసులో ఉంచుకుంటే అది వారినే నాశనం చేస్తుందని ఘాటుగా స్పందించింది సోనమ్ కపూర్.

అయితే ఆ మహిళ అమెరికన్‌ ఇన్ఫుఎన్సర్ తన ఖాతా హ్యాక్ చేసి ఎవరో మెసేజ్ లు పంపారని.. ఇప్పుడే తన ఆధీనంలోకి వచ్చిందని పేర్కొంది. ఇక నేనెప్పుడూ ద్వేషంతో కూడిన సందేశాల్ని పంపలేదు. పంపను కూడా అని ఆ మహిళా పేర్కొంది. ఇక సోనమ్ కపూర్.. 2018 మే 8న ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు.

టీటీడీ చైర్మన్ కు మాజీ ఐఏఎస్ అధికారి ఘాటు రిప్లై

ఆ రెండు సీరియల్స్ ను బిగ్ బాస్ బీట్ చేయలేకపోతుంది

ఈరోజు మరో టీడీపీ ఎమ్మెల్యే సీఎం జగన్ తో భేటీ