దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8171 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 198706 కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 204 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 5598 కి చేరింది. ఇక ఈ కరోనా కారణంగా పలువురు సినీ, రాజకీయ నాయకులు మరణించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే బాలీవుడ్ ను తాకినా కరోనా వైరస్ తాజాగా ఓ బాలీవుడ్ నటి ఫ్యామిలీకి సోకడంతో తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం ఆ నాటికే కాకండా ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. బాలీవుడ్ నటి మోహెనా కుమారి సింగ్ ఆమె భర్త సుయేష్ రావత్, మామ సత్పాల్ మహారాజ్‌, అత్త అమృతరావత్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ప్రస్తుతం వారందరు ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక మోహెనా కుమారి సింగ్ ‘యే రిష్టా క్యా కహ్లేతా హై’ సినిమాతో పరిచయమయ్యి ఆ తరువాత పలు సినిమాలలో నటించారు. ఇక ఆమె గత ఏడాది అక్టోబర్ లో ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి కుమారుడు సుయేష్ రావత్‌ను పెళ్లిచేసుకున్నారు.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ఆపకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపుతా..!

నాగబాబు గురించి బాలకృష్ణ అంత మాటనేసాడేమిటి