పంజాబ్ లోని లూధియానాలో భారీ దోపిడీ జరిగింది. ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ గోల్డ్‌ లోన్‌ సంస్థల్లోకి ఆయుధాలు పట్టుకుని ముసుగు ధరించిన దొంగలు సిబ్బందిని భెదిరించి వారిని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత సిబ్బంది నుండి లాకర్ తాళాలు తీసుకుని అందులో 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దాదాపు 12 కోట్ల విలువచేసే బంగారాన్ని ఎత్తుకుపోయారు.

బాలీవుడ్ సినిమా రేంజ్ ను తలపించే ఈ దోపిడీ మొత్తం కేవలం 10 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఇక దోపిడీ జరిగిన సమయంలో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా పరిశీలించగా దొంగతనానికి వచ్చిన వారు ఒకే రకమైన దుస్తులను ధరించడం జరిగింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •