బోండా ఉమా మరొక రాజకీయ ఫ్లాట్ ఫారం ఎత్తుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ దారుణంగా ఎన్నికలలో పరాజయం చెందటంతో పాటు, ఇక లోకేష్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ పుంజుకునే అవకాశం లేకపోవడం కూడా బోండా ఉమ పార్టీ మారడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మొదటగా బీజేపీలోకి వెళ్లాలని ప్రయత్నించినా చివరకు వైసీపీ పార్టీని ఎంచుకొని ఇప్పటికే మంతనాలు పూర్తి చేశారట.

ఇక బోండా ఉమాపై గత ఎన్నికలలో విజయవాడ సెంట్రమ్ నియోజకవర్గం నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు ఎటువంటి ఇబ్బంది రాకుండా విజయవాడ తూర్పు ఇంచార్జి బాధ్యతలు బోండా ఉమకు అప్పగించాలని వైసీపీ నాయకత్వం భావిస్తోందట. కానీ బోండా ఉమ తూర్పులో ఇప్పటికే గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ పార్టీ నేత బొప్పన రవికుమార్, యలమంచిలి రవి ఉండటంతో వారి నుంచి పూర్తి సహకారం రాదని బావిస్తున్నాడట.

కానీ వైసీపీ నాయకత్వానికి బోండా ఉమకు మధ్య చర్చలు జరుగుతుంటే మరోవైపు సోషల్ మీడియాలో బోండా ఉమను వైసీపీలోకి తీసుకోవద్దని వైసీపీని అభిమానించే కార్యకర్తలు వాపోతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో బోండా ఉమ చేసిన అరాచకాలతో పాటు, అసెంబ్లీ సాక్షిగా తమ పార్టీకి చెందిన ఇప్పటి పౌరసరఫరాల మంత్రి కొడాలి నానిని “పాతేస్తా నాకొడక” అనే మాటలు మాట్లాడి తన గౌరవాన్ని పూర్తిగా కోల్పోయాడు. అలాంటి నేతను వైసీపీలోకి తీసుకువచ్చి క్యాడర్ కు ఎటువంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలలో కార్యకర్తలు ఎన్ని సలహాలు ఇచ్చినా పలానా నాయకుడికి ఉన్న పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని పార్టీలోకి చేర్చుకోవడం అన్నది సర్వసాధారణం.  


Tags: Bonda Uma, tdp


  •  
  •  
  •  
  •  
  •  
  •