బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ ఇంట కరోనా కలకలం రేపింది. బోనికపూర్ ఇంట్లో పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. తన ఇంట్లో పనిచేసే చరణ్‌ సాహూ మే 16 న అస్వస్థతకు గురవడంతో బోనికపూర్ శనివారం అతడికి కరోనా పరీక్షా చేయించాడు. దీంతో అతడికి కరోనా నిర్ధారణ అయినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక అతడిని హటాహుటిన ఐసోలేషన్‌లో ఉంచారు. ఇక తాజాగా వారి ఇంట్లో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. ముంబయిలోని లోకంద్‌వాలాలో బోని తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో కలసి ఉంటున్నారు. వారి ఇంట్లో ప్రస్తుతం ముగ్గురికి ఈ వైరస్ సోకింది.

ఇక దీనిపై స్పందించిన బోనికపూర్.. తమ ఇంట్లో తాజాగా మరో ఇద్దరికి కరోనా సోకిందని.. తనతో పాటు తమ ఇద్దరు కుమార్తెలకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ లకు నెగిటివ్ వచ్చిందని చెప్పారు. ఇక ముందోస్తూ చర్యల్లో భాగంగా వీరు ముగ్గురు హోమ్ క్వారంటైన్‌లో ఉండి ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటున్నారు.

పదవ తరగతి పరీక్షలపై కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రభుత్వం..!

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తెలుగు బిగ్ బాస్-4 కంటెస్టెంట్స్..?

ఏపీలో 2500 దాటిన పాజిటివ్ కేసులు.. 55 మరణాలు..!