జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా జగన్ సర్కార్ పై ఘాటుగా విమర్శలు చేస్తున్నాడు. రాష్ట్రంలో గత పదేళ్లలో ఎప్పుడు లేనటువంటి వరదలు వస్తే ఇసుక దొరకడం లేదని గగ్గోలు పెడతాడు. మరొకవైపున తెలుగు భాషను ఏపీ ప్రభుత్వం చంపేస్తుందని, ఇంగ్లీష్ బాష పెట్టి తెలుగు భాషను తీసివేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరని, తెలుగు భాషను తీసివేసిన వారు మట్టిలో కలిసిపోతారని తెలుగు భాషను కాపాడుకోవడానికి భాషాభిమాన ప్రేమికులు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ ఇష్టమొచ్చినట్లు పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని మట్టిలో కలిసిపోతారని శాపనార్ధాలు పెడుతున్నారని, ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటమేనా, ఆ ఆక్రోశం దేనికని రాజకీయాలలో ఉండవలసిన లక్షణమేనా, అసలు పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ మీడియం స్కూల్ లో చదవుతున్నారని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా మిగతా అన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాడని అన్నారు. తమాషాలు చేస్తున్నావా నోరు నీకే ఉందని అనుకుంటున్నావా? ఇంగ్లీష్ భాషపై పట్టు లేకపోతే విద్యార్థుల భవిష్యత్ ఏమైపోవాలని బొత్స వ్యాఖ్యలు చేసారు.