పెళ్ళికూతురికి కరోనా వైరస్ రావడంతో 32 మంది క్యారంటైన్ కి వెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. భోపాల్‌లోని జట్ ఖేదీ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు రైజన్‌ జిల్లాలోని సత్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సోమవారం వివాహం అయ్యింది. ఈ పెళ్ళికి 32 మందికి పైగా హాజరయ్యారు.

అయితే ఆ మహిళాకు గత వారం జ్వరం వచ్చింది. మందులను వాడడంతో తగ్గిపోయింది. అయితే ఆమెకు జ్వరం తగ్గినప్పటికీ కుటుంభ సభ్యులు ఆమెకు తాజాగా కరోనా టెస్ట్ చేయించగా దానిలో పాజిటివ్ గా వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పెళ్లి కుమారుడు, పురోహితుడు సహా పెళ్ళికి వచ్చిన 32 మందిని క్యారంటైన్ కి తరలించారు. ఇంకా అధికారులు వారి కాంటాక్ట్ అయిన వారిని తెలుసుకునే పనిలో పడ్డారు.

సినిమా షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్..!

గుడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో కరోనా వ్యాక్సిన్..!