ఓ తండ్రి తన కూతురు పెళ్ళికి ఏకంగా 9 లక్షలు ఖర్చుపెట్టి ఓ హెలికాఫ్టర్ తెప్పించాడు. మహారాష్ట్రలోని నాదెండ్ జిల్లా అర్తపూర్ తహసీల్ పరిధి కొండా గ్రామ సర్పంచ్ రామారావు కుమార్తె శిల్పాకు ఉక్లి గ్రామానికి చెందిన మోహన్ గాయక్ వాడ్ తో పెళ్లి కుదిరింది. అయితే వివాహ సమయంలో తనను పెళ్లి మండపానికి హెలికాఫ్టర్ లో తీసుకురావాలని తన కూతురు కోరడంతో తన కూతురు ముచ్చట తీర్చడం కోసం తండ్రి రామారావు 10 రోజుల కిందట పూణే వెళ్లి హెలికాఫ్టర్ బుక్ చేసుకున్నాడు. దానికి కిరాయిగా 9 లక్షలు చెల్లించాడు.

ఇక సోమవారం మధ్యాహ్నం కొండా గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలోని అర్తపూర్ తహసీల్ కేంద్రంలో పెళ్లి జరిగింది. ఇక వధువును ఇంటి నుండి పెళ్లి మండపానికి హెలికాఫ్టర్లో తీసుకువచ్చారు. అలాగే పెళ్లయిన తర్వాత కూడా వధూవరులను 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరుడి ఇంటికి హెలికాఫ్టర్ల లోనే పంపించారు. ఇక పెళ్ళికి వచ్చిన వారితో పాటు ఊరు జనం అంత ఈ తతంగాన్ని చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఇక తన తండ్రి తన కోరికను తీర్చడం చాలా సంతోషంగా ఉందని వధువు ఈ సందర్బంగా తెలియచేసింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •