ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది కరోనా బారిన పడగా, 2.5 లక్షల మందికి పైగా మృత్యువాతపడ్డారు. అయితే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులలో కరోనా మరణాలు భారీగా ఉండడంతో ఆ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇక ఆ దేశాల్లో కరోనా మరణాల ఎక్కువుగా ఉండడానికి కారణం అక్కడ వారి ఆహార అలవాట్లేనని భారత సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుడు తెలియచేసాడు.

ఇక అధిక బరువు, ఊబకాయం కరోనా మరణాలకు ముఖ్య కారణం అని బ్రిటన్ లోని జాతీయ వైద్య సేవా విభాగం ముఖ్యమైన వారిలో ఒకరైన డాక్టర్ మల్హోత్రా తెలియచేసారు. వారి ఆహార అలవాట్లే వారి మరణాలకు దారి తీస్తున్నాయన్న డాక్టర్ మల్హోత్రా.. ఆరోగ్య సమస్యలతో అప్రమత్తం అయ్యే భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.

కరోనా పై పోరులో జీవన విధాన మార్పులు ముఖ్య ఆయుధమని ఆయన తెలియచేసారు. ముఖ్యంగా టైప్ 2, మధుమేహం, బిపి, గుండెజబ్బులు అనేవి కరోనా మరణాలకు మూడు ప్రధాన కారణాలని అన్నారు. అధికంగా శరీరంలో కొవ్వు పేరుకు పోవడం ప్రధాన సమస్యని అన్నారు. అమెరికా, బ్రిటన్ లో 60 శాతం ప్రజలు స్థూలకాయులని తెలియచేసిన ఆయన.. ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవన విధానాన్ని కొన్ని వారాలలోనే సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.

మద్యం కోసం క్యూ కట్టిన అమ్మాయిలు.. సోషల్ మీడియాలో వైరల్..!

ఇండియాలో బయటపడ్డ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అంటువ్యాధి..!

ఏనుగులు ఒకదానిపై ఒకటి దాడులకు దిగాయి.. వీడియో వైరల్..!

నగల దుకాణంలో కొండచిలువ ప్రత్యేక్షమవడంతో షాక్..!