బ్రదర్ అనిల్ కుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగయ్య పేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంటలోకి దూసుకుపోయింది. కాగా ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో అనిల్ సురక్షితంగా బయట పడ్డారు. ప్రమాద సమయంలో బ్రదర్ అనిల్ తో పాటు డ్రైవర్, ఆయన గన్ మెన్లు ఉన్నారు.

ఇక ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఘటన స్థలానికి చేరుకున్నారు. ఉదయభాను తన కారులో అనిల్, డ్రైవర్, గన్ మెన్లు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్య అనంతరం అనిల్ యదావిధిగా తన పర్యటనకు వెళ్లిపోయారు.