రోజు రోజుకి జియో దెబ్బకు ప్రైవేట్ సంస్థలైన ఐడియా వోడాఫోన్ తో పాటు ఎయిర్టెల్ కూడా కస్టమర్స్ ను కోల్పోతూ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇక వాటి పరిస్థితే అలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పరిస్థితి మరింత అధ్వానంగా తీసికట్టుగా మారింది. దీనితో తన కస్టమర్లను నిలుపుకోవడానికి బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. నిన్న దీపావళి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు దేశం మొత్తం ఎక్కడికైనా ఫ్రీగా ఫోన్లు చేసుకోవచ్చని చెప్పి సంచలనం సృష్టించింది.

ఇప్పుడు తన వినియోగదారులను కాపాడుకోవడానికి కేవలం 180 రోజులకు 698 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 200 జీబీ డేటాతో పాటు ఏ నెట్వర్క్ కైనా ఉచితంగా ఫోన్లు చేసుకునే సదుపాయం కల్పించింది. బీఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన ఈ ప్లాన్ తో డేటాను పరిమితంగా వాడుతూ, వ్యాలిడిటీ కావాలనుకునే వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం హైదరాబాద్, తెలంగాణ సర్కిల్ లో మాత్రమే అందుబాటులో ఉంది.