ఒకప్పుడు ప్రభుత్వ సంస్థ BSNL దేశంలో ఒక వెలుగు వెలిగింది. వైర్ లెస్ ఫోన్ ల యుగం లేనప్పుడు BSNL సంస్థ ల్యాండ్ లైన్ ఫోన్ లతో తాను ఆడిందే ఆట… పాడిందే పాట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ రోజులలో టెక్నాలజీ గురించి చెబుతూ అప్పట్లో తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఫోన్ కొనడానికి ఆరు నెలలు పట్టిందని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్ధమవుతుంది. అప్పుడు అందరూ ల్యాండ్ లైన్ ఫోన్ లనే వాడే వారు. వైర్ లెస్ ఫోన్ అంటే అదొక గొప్ప విషయం. కానీ ఈరోజులలో టెలికామ్ సంస్థలు ఉచితంగా ఫోన్ లు చేసుకొనే సదుపాయం కల్పించడంతో BSNL ల్యాండ్ లైన్ లు మసకబారిపోయాయి. ఎవరు ల్యాండ్ లైన్ పెట్టించుకోవడానికి సిద్ధపడకపోవడంతో బారి నష్టాలలో సంస్థ కూరుకుపోయింది.

ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి BSNL సంస్థ ల్యాండ్ లైన్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మీరు ఎవరికైనా ఫోన్ చేసి ఐదు నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడితే 6 పైసలు డబ్బులు మీకు ఎదురు ఇవ్వనుంది. ఇలా మీరు ఎన్ని ఐదు నిమిషాలు మాట్లాడితే అన్ని 6 పైసలు మీ అకౌంట్ లో పడతాయి. ఇక దీనితో పాటు 10 Mbps స్పీడ్ తో రోజుకు 5 GB వరకు ఉచితంగా బ్రాండ్ బ్యాండ్, వైఫై సేవలు అందించనున్నట్లు తెలిపింది.