కర్నూల్ జిల్లా టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్టీ మారబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. గతంలో టీడీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన ఆయన ఆ తర్వాత రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో పార్టీ ని ఏర్పాటు చేసి రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై తన గళం విప్పారు. గతంలో నందికొట్కూరు నుండి 1994,1999 లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గా గెలుపొందాడు. ఇక ఆయన పార్టీ నుండి ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేకపోవడంతో గత ఎన్నికల ముందు టీడీపీ లో చేరారు.

ఇక మొన్న జరిగిన ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం తర్వాత కొంత కాలంగా మౌనంగా ఉన్న బైరెడ్డి.. ఇప్పుడు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ కర్నూల్ మొత్తం పాతుకుపోయింది. బైరెడ్డి అన్న కొడుకు బైరెడ్డి సిదార్థారెడ్డి వైసీపీలో మంచి యాక్టీవ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీలో బడా నాయకులందరూ అన్ని నియోజకవర్గాలలో పట్టు సాధించి ఉన్నారు. ఇప్పుడు ఆయనకు వైసీపీ లో చేరడానికి దారి లేకపోవడంతో బీజేపీ లో చేరడానికి రెడీ అవుతున్నారు. మొన్న కర్నూల్ లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన బైరెడ్డి ఆ విషయాన్నీ తన అనుచరులకు తెలియచేశాడు.

ఇప్పటికే రాయలసీమలో టీజీ వెంకటేష్, గంగుల ప్రతాప్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వంటి నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీలో వచ్చే ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపాలని చూస్తున్న బీజేపీ.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ని చేర్చుకుంటే పార్టీ రాయలసీమలో కొంత బలపడుతుందన్న ఉద్దెశంతో ఉంది. కావున ఆయన త్వరలోనే టీడీపీ కి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారు.

Byreddy Rajasekhar Reddy