టిక్ టాక్… టిక్ టాక్… టిక్ టాక్ మన దేశంలో టిక్ అనే ఒక్క యాప్ వచ్చిన తరువాత యువతతో పాటు, గృహిణులుగా స్థిరపడిపోయిన ఎంతో మంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పాపులర్ గా మారిపోయారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో టిక్ టాక్ స్టార్ లు మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. టిక్ వచ్చిన తరువాత సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. నెటిజన్స్ ఎక్కువగా పేస్ బుక్ వదిలేసి టిక్ టాక్ లో కలం గడిపేస్తుండటంతో పేస్ బుక్ కూడా టిక్ టాక్ లాంటి యాప్ తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అలాంటి టిక్ టాక్ మన భారతదేశంలో నిషేధించడంతో దాని మంత్రు సంస్థ బైట్ డ్యాన్స్ కు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. నష్టం వందల కోట్లు ధాటి దాదాపుగా 45 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు చైనా మార్కెట్ వర్గాలు తెలియచేస్తున్నాయి. టిక్ టాక్ అత్యధికంగా డౌన్ లోడ్ లు మన దేశంలో కావడంతో పాటు ప్రతి రోజు యువత సుమారుగా గంట పాటు టిక్ టాక్ యాప్ లో గడుపుతుండటం కూడా ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

మన దేశంలోనే దాదాపుగా 150 మిలియన్లకు పైగా టిక్ టాక్ డౌన్ లోడ్స్ ఉండటంతో ఇప్పుడు భారత్ ప్రభుత్వం నిషేధించడంతో అవన్నీ అన్ ఇన్స్టాల్ అయిపోతున్నాయి. దీనితో చైనాకు డిజిటల్ పరంగా భారత్ పెద్ద దెబ్బ వేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాలు కూడా టిక్ టాక్ తో పాటు చైనా యాప్స్ తొలగించాలని ఆ దేశ ప్రజలతో పాటు నాయకులు కూడా కోరుతున్నారు. దీనితో టిక్ టాక్ తో పాటు చైనాకు చెందిన డిజిటల్ మార్కెట్ కు లక్షల కోట్లు నష్టం వాటిల్లే అవకాశం కనపడుతుంది.