నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూర్చుని భూములు పంచుకుంటున్నారా అని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ స్పందించారు. టాలీవుడ్ లో తమకు అందరు సమానమేనని బాలకృష్ణకు ఒక ప్రత్యేక స్థానం ఉందని.. ఆయనకు ఇచ్చే గౌరవం ఆయనకు ఇస్తామన్నారు. సినీ ప్రముఖులు అందరు కలసి సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ కు బాలకృష్ణను పిలవాల్సిన భాద్యత మా అసోసియేషన్ దే అన్నారు. చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి మంత్రి తలసాని లీడ్ తీసుకున్నారని.. చిత్రసీమలో విభేదాలు లేవని అంతా ఒకటేనని సి.కళ్యాణ్ తెలిపారు.

చిత్ర సీమను నిన్నటిదాకా దాసరి నారాయణ రావు గారు భుజాన వేసుకుని సమస్యలను పరిష్కరించారని.. ఇప్పుడు ఎవరైనా భుజాన వేసుకోవచ్చని.. చిరంజీవి గారికి పేస్ వాల్యూ పనికొస్తుందని ఆయనను మేం అడిగాం అని చెప్పారు. ఎక్కడికి ఎవరిని అవసరమైతే వారిని తీసుకెళ్తామని.. ఎవరితో పని జరుగుతుంటే వారిని తీసుకెళతాం.. షూటింగులకు ఇబ్బ్బంది లేకుండా పని జరగడం మాకు ముఖ్యమన్నారు సి.కళ్యాణ్.

ఏపీ బీజేపీ అధ్యక్షుడి కోడలు అనుమానాస్పద మృతి..!

తెలంగాణలో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా.. కొత్తగా మరో 117 పాజిటివ్ కేసులు..!