జీవో నెం.45 ద్వారా ఏపీలో షూటింగ్ లు చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా అందచేస్తునట్లు ఆదేశాలిచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిస్టులకు, నిర్మాతలకు, ఇతర సినీ పరిశ్రమ వర్గాలకు హోసింగ్ కొరకు స్థలాలను కేటాయించాలని సీఎం జగన్ కు మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్, వడ్లపట్ల మోహన్ ముఖ్యమంత్రికి బుధవారం లేఖ రాశారు.

గతంలో చెన్నై నుండి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి తరలి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలు నిర్మించుకోవడానికి ల్యాబ్స్ కట్టుకోవడానికి స్థలాలను ఉదారంగా కేటాయించారని.. అదే విధంగా ఇప్పుడు కూడా ఏపీలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కృషి చేయాలనీ ఈ సందర్భంగా లేఖలో నిర్మాతల మండలి తెలియచేసింది.

కూతురితో కలసి అద్దం ముందు మహేష్ బాబు సెల్ఫీ

లాక్ డౌన్ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లడం లేదట