హైదరాబాద్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. భరత్ నగర్ ఫ్లై ఓవర్ నుండి కారు అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఐదుగురు వ్యక్తులతో కారు మూసాపేట్ నుండి సనత్ నగర్ వైపు వెళ్తుండగా ప్రమాదపుశాత్తు కారు అదుపుతప్పి బ్రిడ్జి పై నుండి పడిపోయింది. కారు నుజ్జు నుజ్జు కావడంతో ప్రమాద తీవ్రత ఎంత జరిగిందో అంచనా వేయవచ్చు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్ర అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •