19 ఏళ్లకే నటిగా మారింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె నటించిన మొదటి కన్నడ సినిమా ‘గిల్లి’. ఆ సినిమాలో తనకు నటనపై సరైన అవగాహనా లేకుండానే నటించానని చెప్పింది రకుల్. ఆ సినిమాలో పెద్దగా కష్టపడలేదని.. కేవలం పాకెట్ మనీ కోసమే ఆ సినిమా చేసానంది. ఆ తర్వాత కారు కొనుకోవాలన్న కోరికతో నటిగా కొనసాగానని చెప్పింది రాహుల్.

నా ఫ్రెండ్స్ లో ఎవరికి కారు లేదు. కావున నేనే మొదటి కారు కొనాలనే ఉద్దెశంతో సినిమాలను ఒప్పుకున్నానని అన్నారు. ఆ తర్వాత అదే నా వృత్తిగా మారిపోయిందని చెప్పింది. ఒక ఉద్యోగాన్ని ఎంత నిబద్దదతో చేస్తానో సినిమాలలో అంతే క్రమ శిక్షణతో నటిస్తాను అంది. బహుశా నా ఎదుగుదలకు అదే కారణం కావచ్చు అని చెప్పింది.

ప్రస్తుతం రకుల్ ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక తెలుగులో వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్, స్పైడర్, ఖాకీ, సరైనోడు, ధ్రువ, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలలో నటించి మెప్పించింది రకుల్ ప్రీత్ సింగ్.